రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్
రాజ్యసభ నుంచి విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. పశ్చిమాసియాలో పరిస్థితులపై చర్చకు విపక్షాలు డిమాండ్ చేశాయి. సభలో చర్చించకుండా ప్రకటన చేయడంపై విపక్ష సభ్యలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాకౌట్ చేశారు. అంతకుముందు పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలపై కేంద్రమంత్రి జైశంకర్ వివరాలు తెలిపారు.