VIDEO: నక్కవారిపాలెంలో ఇంటిపై కూలిన వృక్షం
W.G: తుఫాన్ ప్రభావంతో వీచిన గాలులకు బుధవారం ఉదయం మొగల్తూరులోని నక్కవారిపాలెంలో ఓ ఇంటిపైన భారీ వృక్షం కూలిపోయింది. ఇంటిపై వృక్షం కూలిపోవడంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు వీలు లేకపోవడంతో ఇంట్లోనే పిల్లలతో కుటుంబ సభ్యులు ఉండిపోయారు. అధికారులకు ఫోన్ చేసిన స్పందించడం లేదంటూ ఆ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.