'సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి'
SKLM: గార, శిమ్మపేటలో శుక్రవారం 104 ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ మేరకు 104 సిబ్బంది ఆధ్వర్యంలో శ్రీకూర్మం పీహెచ్సీ వైద్యులు డా. మూర్తి సుమారుగా 60 మందికి ఆరోగ్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేశారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచనలు చేశారు. ఈ వైద్య శిబిరంలో హెల్త్ సూపర్‌వైజర్ శ్యామ్ సుందర్ పాల్గొన్నారు.