'రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత'
ADB: ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రూరల్ CI ఫణిదర్ అన్నారు. తాంసి మండల కేంద్రం నుంచి అంబుగమ వరకు గల 5 కిలో మీటర్ల రోడ్డుకు మూల మలుపుల వద్ద పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దీంతో సర్పంచ్ తుర్పా భాయి యశ్వంత్ రూ.20 వేల తన సొంత ఖర్చుతో ఆదివారం జేసీబీ సహాయంతో CI సమక్షంలో మొక్కలను తొలగించారు. సర్పంచును సీఐ అభినందించారు.