బలిజిపేట పోలీసు స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ
PPM: బలిజిపేట పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా స్టేషన్ పరిసరాలను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆనంతరం లాక్ అప్ రూం, కంప్యూటర్ రూం, రిసెప్షన్ కౌంటర్‌ను పరిశీలించారు.స్టేషన్‌కు వచ్చే పిర్యాదు దారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు. ఆయన వెంట స్థానిక ఎస్సై సింహాచలం, సిబ్బంది పాల్గొన్నారు.