న్యూ రాజరాజేశ్వరి పేటలో మంత్రి పర్యటన

NTR: విజయవాడ 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా నేపథ్యంలో మంత్రి నారాయణ, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమా ఆయా ప్రాంతాలను పరిశీలించారు. వైద్య శిబిరాలను సందర్శించి, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదన్నారు. ప్రతి ఇంటినీ సర్వే చేసి, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని గుర్తించి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.