త్రిలింగ రామేశ్వరాలయం అభివృద్ధికి రూ.కోటి మంజూరు

KMRD: నాగిరెడ్డిపేట మండలం తాండూర్ లోని త్రిలింగ రామేశ్వరాలయం అభివృద్ధికి దేవదాయశాఖ నుంచి కోటి రూపాయలను ఎమ్మెల్యే మదన్మోహన్ మంజూరు చేయించారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్ తెలిపారు. ఎమ్మెల్యే పేరిట శివాలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.