నేరాల శాతం గణనీయంగా తగ్గింది

ELR: వార్షిక తనిఖీలలో భాగంగా ఏలూరు మూడో పట్టణ పోలీస్ స్టేషను ఏలూరు రేంజ్ ఐజి అశోక్ కుమార్ బుధవారం పరిశీలించారు. రేంజ్‌లో నేరాల శాతం గణనీయంగా తగ్గిందని తెలిపారు. సైబర్ క్రైమ్ నేరాలు మాత్రం పెరుగుతున్న నేపథ్యంలో దర్యాప్తు ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం జరగకూడదని స్పష్టం చేశారు. యుద్ధం వంటి అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తీర ప్రాంతాల్లో గస్తీ పెంచామన్నారు.