గ్లోబల్ సమ్మిట్‌లో సినీ రంగంపై ప్రత్యేక చర్చ
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో సినీ రంగంపై ప్రత్యేక చర్చ జరగనుంది. ఈ నెల 9న జరిగే సదస్సులో 'వన్ కంట్రీ - మెనీ సినిమాస్' పేరుతో ప్యానల్ డిస్కషన్స్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్చలో ప్రముఖ దర్శకుడు సుకుమార్, బాలీవుడ్ నటీనటులు జెనీలియా, రితేశ్ దేశ్‌ముఖ్ దంపతులు, అర్జున్ కపూర్, అనిరుధ్, పార్వతీ గోయెల్, అసిఫ్ అలీ, ప్రియదర్శన్ పాల్గొంటారు.