లారీని ఢీకొన్న కారు.. ముగ్గురు దుర్మరణం

లారీని ఢీకొన్న కారు.. ముగ్గురు దుర్మరణం

JN: జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవపూర్ శివారులో గల వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారిపై లారీని వెనుక నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.