పసుపు రైతులకు అండగా ప్రభుత్వం: మంత్రి

పసుపు రైతులకు అండగా ప్రభుత్వం: మంత్రి

TG: పసుపు రైతులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తేమ కలిగిన పసుపును కోతలు లేకుండా కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. తేమ శాతం పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని అధికారులకు సూచించారు. రైతులను ఇబ్బంది పెడితే మార్కెట్ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.