జమ్మలమడుగులో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన

KDP: జమ్మలమడుగులోని పాత బస్టాండ్ వద్ద శనివారం మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించారు. 'ప్లాస్టిక్ భూతాన్ని అరికడదాం పర్యావరణాన్ని రక్షిద్దాం' అంటూ నినదించారు. ప్లాస్టిక్ వల్ల నష్టాలను తెలుపుతూ చేసిన వినూత్న వేషధారణ పలువురిని ఆకట్టుకుంది. ప్లాస్టిక్ నిల్వ ఉంచినా, అమ్మినా, వినియోగించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.