VIDEO: టీచర్లు లేరు.. చదువులెలా సాగాలి?
GDWL: ఉండవెల్లి మండలం బొంకూరు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బుధవారం ధర్నా చేశారు. పాఠశాలలో 236 మంది విద్యార్థులకు కేవలం నలుగురు టీచర్లు మాత్రమే ఉన్నారని.. దీంతో చదువులు సరిగా సాగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మండల స్థాయి నుంచి జిల్లా అధికారుల వరకు తమ సమస్యను తెలిపినా పరిష్కారం లభించడం లేదని వాపోయారు.