VIDEO: 200 కిలోల మామిడి పండ్లు స్వాధీనం

VIDEO: 200 కిలోల మామిడి పండ్లు స్వాధీనం

HYDలోని గోషామహల్‌లో డైమండ్ రైడ్ అనే ఇథలీన్ రసాయనాన్ని అధిక మోతాదులో వాడి కృత్రిమంగా పండించిన సుమారు 200 కిలోల మామిడి పండ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 20 కిలోల సాచెట్లను వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలా రసాయనాలతో పండించిన మామిడి పండ్ల వల్ల వాంతులు, విరేచనాలు, శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తవచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.