నీట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

నీట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

KNR: నీట్ పరీక్షకు కరీంనగర్ జిల్లాలో ఆదివారం జరిగే నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. 2,975 మంది హాజరుకానున్న ఈ పరీక్ష కోసం జిల్లాలో 7 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష రాసేవారిని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు మాత్రమే అనుమతిస్తారు. నిర్ణీత సమయం దాటితే అనుమతించరు.