ఈ బాలుడి ఆచూకీ తెలుసా
SRD: సంగారెడ్డి కొత్త బస్టాండ్ సమీపంలో గురువారం మధ్యాహ్నం బాలుడు తప్పిపోయాడు. ఓ షాప్ వద్ద ఒంటరిగా ఏడుస్తూ ఉన్న పిల్లవాడిని స్థానికులు గమనించి పట్టణ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ప్రస్తుతం బాలుడు పోలీసుల సంరక్షణలో సురక్షితంగా ఉన్నాడు. చిన్నారి ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని పట్టణ సీఐ రామనాయుడు కోరారు.