భారత ఆర్మీ గురి అదిరింది.. ఎలాగంటే?

పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ప్రాంతాలలో భారత ఆర్మీ మెరుపు దాడులకు పాల్పడింది. ఇందుకు త్రివిధ దళాలకు చెందిన ప్రిసిషన్ స్ట్రైక్ వెపన్ సిస్టమ్స్‌తో పాటు లాయిటరింగ్ మ్యూనిషన్ వెపన్‌ను వాడింది. దాడి చేయాల్సిన ప్రాంతాలలో భారత భూభాగం నుంచే దాడి చేసింది. టార్గెట్‌లను అత్యంత కచ్చితత్వంతో ఛేదించడానికి లాయిటరింగ్ మ్యూనిషన్ వెపన్ సహాయపడింది.