VIDEO: రాయచోటి వద్దు, రాజంపేట ముద్దు: ఎమ్మార్పీఎస్ ర్యాలీ
అన్నమయ్య: జిల్లాలోని రైల్వే కోడూరులో MRPS ఆధ్వర్యంలో బుధవారం నిరసన ర్యాలీ జరిగింది. రాయచోటి జిల్లా వద్దు, రాజంపేట జిల్లా కావాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు రాజంపేటను జిల్లా చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు మరిచారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు అంబటి రాధాకృష్ణ, చంగయ్య ఆరోపించారు.