కనకదుర్గమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

ELR: దెందులూరు మండలం సింగవరంలో విజయ కనకదుర్గమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. దెందులూరు MLA చింతమనేని ప్రభాకర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యేకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.