బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ MLA
BHPL: రేగొండ మండలం కనిపర్తి గ్రామానికి చెందిన గ్రామ యూత్ అధ్యక్షుడు శ్రీపతి నాగరాజు తండ్రి శ్రీపతి మల్లయ్య ఆదివారం అనారోగ్యానికి గురై మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి మృతుడి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.