శక్తి యాప్ వినియోగంపై విద్యార్థులకు అవగాహన

శక్తి యాప్ వినియోగంపై విద్యార్థులకు అవగాహన

ELR: జిల్లా కేంద్రంలో ఉన్న శ్రీ విద్యాలయ జూనియర్ కాలేజ్ విద్యార్థినిలకు శక్తి యాప్ పై పోలీసులు శుక్రవారం అవగాహన కల్పించారు. శక్తి యాప్ మహిళలకు అత్యవసర పరిస్థితుల్లో భద్రత కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ రూపొందించిన వినూత్న మొబైల్ అప్లికేషన్ అని తెలియజేశారు. SOS బటన్ నొక్కిన వెంటనే సమీప పోలీస్ సాయం అందుతుందనీ అన్నారు.