టీడీటీ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్‌కు ఘన నివాళి
సత్యసాయి: జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, సంఘసంస్కర్తగా దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.