VIDEO: పెనుగొలనులో దత్త జయంతి వేడుకలు

VIDEO: పెనుగొలనులో దత్త జయంతి వేడుకలు

NTR: గంపలగూడెం (M)పెనుగొలనులోని శిరిడి సాయిబాబా మందిరంలో ఇవాళ దత్త జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు సాయిబాబా మూలవిరాట్ పాల రాయి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు 108 దీపాలతో దీపోత్సవం, సాయిబాబా నామ పారాయణం చేశారు. ఇటీవల మధిరలో భగవద్గీత పారాయణం పోటీల్లో గెలుపొందిన 4వ తరగతి బాలిక దాములూరి రిత్విక ఉమామహేశ్వరిని సాయిబాబా కమిటీ సభ్యులు సన్మానించారు.