'సమస్యల పరిష్కారంపై అవగాహన కలిగి ఉండాలి'
BHPL: జిల్లా ఐడీవోసీ కార్యాలయంలో ఇవాళ కలెక్టర్ రాహుల్ శర్మ, ట్రైనీ IAS అధికారుల బృందం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రామ స్థాయి పరిపాలన, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంపై సివిల్ సర్వీసెస్ శిక్షణా అధికారులకు సమగ్ర అవగాహన కల్పించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల వాస్తవ పరిస్థితులపై ప్రత్యక్ష అనుభవం అవసరమని వారు పేర్కొన్నారు.