వృద్ధాశ్రమాన్ని తనిఖీ చేసిన జడ్జి

వృద్ధాశ్రమాన్ని తనిఖీ చేసిన జడ్జి

SRD: సంగారెడ్డి పట్టణంలోని వృద్ధాశ్రమాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య తనిఖీ చేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు వృద్ధాశ్రమాన్ని తనిఖీ చేసినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా వృద్ధులతో మాట్లాడి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి న్యాయ సహాయం కావాలన్నా ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు.