ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నెల్లూరు: సంగంలో జనసేన సీనియర్ నాయకులు దాడి భాను కిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జనసేన నియోజకవర్గ నాయకులు చదలవాడ హరీష్ కుమార్ హాజరయ్యారు. అనంతరం జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఇరిగేషన్ గెస్ట్ హౌస్‌లో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. పేదలకు పండ్లు పంపిణీ చేశారు.