చెరువులో పడి వ్యక్తి మృతి

చెరువులో పడి వ్యక్తి మృతి

ప్రకాశం: చెరువులో జారిపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన టంగుటూరులోని పోలీస్ స్టేషను ఎదురుగా ఉన్న చెరువులో బుధవారం జరిగింది. పోలీసులు వివరాల మేరకు టంగుటూరు ముత్తరాజుపాలెంకు చెందిన మామిళ్ల చిరంజీవి (59) చెరువులో జారిపడి మృతి చెందాడు, అటుగా పోతున్న బాటసారులు పోలీసులకు సమాచారం ఇవ్వగా మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.