కేంద్రమంత్రితో డిప్యూటీ సీఎం భట్టి భేటీ

TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషిని కలిశారు. రాష్ట్రానికి 4,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేటాయింపులపై చర్చించారు. ఈ సోలార్ విద్యుత్ కేటాయింపు వల్ల రాష్ట్రంలో పర్యావరణ అనుకూల విద్యుత్ ఉత్పత్తికి ప్రోత్సాహం లభిస్తుందని భట్టి అన్నారు. తాడిచర్ల కోల్ బ్లాక్ అనుమతులపై త్వరలో ఆదేశాలు ఇస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు.