ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత: ఎమ్మెల్యే
ELR: పెదవేగి మండలం దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బుధవారం పలు గ్రామాలకు చెందిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. అలాగే నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.