పట్టాపాస్ పుస్తకం లేని రైతులకు ఎరువులు పంపిణీ చేయండి: కలెక్టర్

NZB: పట్టా పాస్ పుస్తకాలు లేని రైతులు ఎవరైనా పంటలు సాగు చేస్తుంటే వారికి కూడా ఎరువులు పంపిణీ చేయాలని నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి ఆదేశించారు. వారు పంటలు వేశారా లేదా అన్నది పక్కాగా నిర్ధారించుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా యూరియా ఇతర ఎరువుల కొరత లేదన్నారు. రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ స్పష్టంచేశారు.