బాపట్లలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

BPT: ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను ఎమ్మెల్యే నరేంద్ర వర్మ పట్టణంలోని 11వ వార్డు దేవుడు మన్యంలో పంపిణీ చేశారు. సోమవారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో ఆర్డీఓ గ్లోరియా సమక్షంలో ఆయన ప్రజలకు రేషన్ కార్డులు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మార్పులు, చేర్పులు అనంతరం నూతనంగా మంజూరైన కార్డులు అందజేస్తున్నామన్నారు.