యోగతో మానసిక ప్రశాంతత: రామచంద్రారెడ్డి
GDWL: యోగ వలన సంపూర్ణ ఆరోగ్యంతోపాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ఎస్.రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. అయిజలోని అంబాభవాని దేవాలయం వద్ద యోగా గురువు శివానంద ఆధ్వర్యంలో మొదటి బ్యాచ్ యోగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అభ్యర్థులు ధ్యానాన్ని ఏదైనా క్రీడకు కేటాయించాలని ఆయన సూచించారు.