సమిష్టి నిర్ణయాలతోనే అభివృద్ధి సాధ్యం: ఆనందరావు
ADB: సమిష్టి నిర్ణయాలతోనే ఆదివాసీల అభివృద్ధి సాధ్యమని రాజ్ గోండు సేవా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆనందరావు అన్నారు. మావల మండల కేంద్రంలోని పిట్టలవాడలో ఆదివారం సమావేశం ఏర్పాటు చేసి నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివాసీల హక్కుల సాధనకై పనిచేయాలని తీర్మానాలు చేశారు.