గద్వాల్‌లో సీఎం పర్యటనకు భద్రతా సమీక్ష
GDWL: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం గద్వాల జిల్లాలో పర్యటించనున్నారు. స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ కుమారుడి వివాహానికి హాజరుకానుండగా, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా సమీక్షించారు. హెలిప్యాడ్, వివాహ వేదికను పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు.