తెలుగులో మాట్లాడిన జపాన్ దేశ రాయబారి
AP: విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సులో జపాన్ దేశ రాయబారి ఓనో కిచ్చీ తెలుగులో ప్రసంగించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 'నేను చాలా గౌరవంగా భావిస్తున్నాను. ఈ అద్భుతమైన కార్యక్రమం ద్వారా జపాన్, భారత్ కంపెనీల మధ్య పరస్పర సహకారం అందిపుచ్చుకోవడంపై నేను సంతోషిస్తున్నాను' అంటూ తెలుగులో ప్రసంగించారు. అలాగే తెలుగు భాషపై తనకున్న అభిమానాన్ని ఎక్స్ ద్వారా పంచుకున్నారు.