'వరద బాధితులను ఆదుకోవాలి'
AKP: వరద బాధితులను ఆదుకోవాలని వైసీపీ అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం సమన్వయకర్త బి.ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. మునగపాక సమీపంలో ఆవ కాలువకు గండి కొట్టడంతో ముంపుకు గురైన ప్రాంతాలను ఆయన శుక్రవారం పరిశీలించారు. బాధితులకు భోజన వసతి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. బాధితులకు నష్టపరిహారాన్ని చెల్లించి ఆదుకోవాలని ఆయన పేర్కొన్నారు.