లారీ ఢీకొని ఒకరు దుర్మరణం

లారీ ఢీకొని ఒకరు దుర్మరణం

CTR: మదనపల్లి రూరల్ మండలం కొత్తవారిపల్లి పంచాయతీ గుండావారిపల్లి వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఐషర్ లారీ ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వ్యక్తిని 108 వాహనంలో మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. సీఐ కళా వెంకటరమణ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లికి తరలించి కేసు నమోదు చేశారు.