'24' దర్శకుడితో రౌడీ హీరో మూవీ?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన '24' సినిమా దర్శకుడు విక్రమ్ కే కుమార్‌తో ప్రాజెక్టు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కథ చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా, ప్రస్తుతం విజయ్.. 'రౌడీ జనార్ధన' మూవీ చేస్తున్నాడు.