ప్రతి ఒక్కరూ 'వందేమాతరం' ఆలపించాలి: పవన్

ప్రతి ఒక్కరూ 'వందేమాతరం' ఆలపించాలి: పవన్

AP: స్వాతంత్ర్య సంగ్రామంలో యావత్ దేశాన్ని ఏకతాటిపై నడిపించిన 'వందేమాతరం' స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జనసేన అధినేత, Dy. CM పవన్ కళ్యాణ్ అన్నారు. వందేమాతరం రచించి నేటితో 150 ఏళ్లు పూర్తవుతున్నందున దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఆలపించాలని పవన్ పిలుపునిచ్చారు. ఈ గేయం ప్రాముఖ్యతను, దాని ఘన చరిత్రను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.