రామప్పలో ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ పర్యటన

MLG: వెంకటాపూర్ మండలం, పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని బుధవారం తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్, తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వి. లచ్చిరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గిరిబాబు ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం లచ్చిరెడ్డి రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని ఆలయ విశిష్టత, శిల్పకళా సంపద గురించి వివరించారు.