పంటి రేవును తనిఖీ చేసిన ఎంపీడీవో

W.G: నరసాపురం-సఖినేటిపల్లి రేవును సోమవారం నరసాపురం ఎంపీడీఓ వీరభద్రరావు తనిఖీ చేశారు. పంటి నిర్వహణ, ఫిట్నెస్ పత్రాలు, డ్రైవర్ లైసెన్స్, లైఫ్ జాకెట్ల సంఖ్య, టిక్కెట్ల విక్రయాల పుస్తకాలను పరిశీలించారు. ఇటీవల నదీ ప్రవాహానికి పంటి ఓ పక్కకు ఒరిగినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై ఆరా తీశారు. ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకూడదన్నారు.