VIDEO: మేకడోణలో తాగునీటి కష్టాలు
KRNL: పెద్దకడబూరు మండలం మేకడోణలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. గ్రామ ఒడిలోనే నౌలేకల్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఉన్నప్పటికీ ఇక్కడి ప్రజలకు తాగునీటి కష్టాలు తీయడం లేదు. గ్రామ పంచాయతీ తాగునీటి సరఫరా చేసినా పైపులైన్ సమస్యతో కులాయిల నుంచి తాగునీరు సక్రమంగా రావడంలేదని గ్రామ ప్రజలు వాపోయారు. దీనిపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.