భక్త కనకదాసు జయంతిలో పాల్గొన్న దీపిక
SS: హిందూపురం మండలం గొల్లాపురం గ్రామంలో శ్రీ భక్త కనకదాసు జయంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూపురం వైసీపీ ఇన్‌ఛార్జ్ దీపిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా కనకదాసు విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ.. ఆయన తన అపర భక్తితో భగవంతుడిని మెప్పించిన వ్యక్తి అని కొనియాడారు.