ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన ఇంఛార్జ్ కలెక్టర్
SRCL: వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని సిరిసిల్ల ఇంఛార్జ్ కలెక్టర్ గరీమ అగ్రవాల్ అన్నారు. చందుర్తి లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే వారికి అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. వైద్యులు, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందించాలన్నారు.