నెతన్యాహు కార్యాలయంపై దాడి చేశాం: ఇరాన్
ఇజ్రాయెల్‌లోని కీలక లక్ష్యాలపై క్షిపణి దాడులు చేశామని IRGC అధికారికంగా ప్రకటించింది. టెల్ అవీవ్‌లోని ఇజ్రాయెల్ సైనిక ప్రధాన కార్యాలయం, నెతన్యాహు కార్యాలయం ఉన్న ప్రాంతాలు, ఇతర రక్షణ కేంద్రాలను టార్గెట్ చేసినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. మరోవైపు ఇరాన్ నుంచి వస్తున్న క్షిపణులను చాలా వరకు తమ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని ఇజ్రాయెల్ ప్రకటించింది.