VIDEO: ఎర్రచందనం తరలిస్తున్న వాహనం సీజ్
CTR: పులిచెర్ల మండలం నుంచి తప్పించుకుని ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పలమనేరు అటవీ శాఖ అధికారులు సీజ్ చేశారు. స్థానిక పోలీసుల సహకారంతో వాహనాన్ని వెంబడించగా అప్పినపల్లి క్రాస్ వద్ద వాహనాన్ని వదిలేసి దుండగులు పారిపోయారు. వాహనాన్ని, 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు FRD నారాయణ తెలిపారు.