రైల్వే స్టేషన్‌లో మొబైల్ దొంగ అరెస్ట్

HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో దొంగతనాలు చేస్తున్న వ్యక్తిని రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు అరెస్టు చేసినట్లుగా శుక్రవారం తెలియజేశారు. అతని వద్ద నుంచి రూ.10,900 విలువచేసే మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. రైల్వే పరిసరాలలో దొంగలు ఉన్నారని, చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రయాణికులకు సూచించారు.