ఆర్టీసీ డిపోను సందర్శించిన ఈడీ

NLG: టీజీఎస్ RTC హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖుష్రో షా ఖాన్ నల్గొండ ఆర్టీసీ డిపోను గురువారం సందర్శించారు. డిపోలోని గ్యారేజీ, బస్టాండ్‌ను పరిశీలించారు. సిబ్బంది ప్రయాణికుల పట్ల మర్యాదగా ఉంటూ మన్ననలు పొందాలని అన్నారు. అనంతరం డిపో ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ కే.జానిరెడ్డి, డిపో మేనేజర్ శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.