రెడ్డి కమ్యూనిటీ అభివృద్ధిపై ఎమ్మెల్యే భరోసా
KRNL: ఎమ్మిగనూరులో రెడ్డి సంఘం సభ్యులు ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డిని ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. రెడ్డి ఫంక్షన్ హాల్ నిర్మాణం, కమ్యూనిటీ అభివృద్ధి అంశాలపై చర్చించారు. అన్ని వర్గాల అభివృద్ధికి తాను సహకరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం పెద్దలు, నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.