పెన్షన్లు పంపిణీ చేసిన PACS చైర్‌పర్సన్

పెన్షన్లు పంపిణీ చేసిన PACS చైర్‌పర్సన్

BPT: అద్దంకి మండలం బొమ్మనంపాడుగ్రామంలో నూతనంగా మంజూరైన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను నాగులపాడు PACS చైర్‌పర్సన్ యేనుగంటి వెంకటరామయ్య(బాబు ) శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలుచేసే ప్రజా ప్రభుత్వమని నిరూపించిందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ స్థాయిఅధికారులు పాల్గొన్నారు.